మరింతగా ముదిరిపోయిన చాట్‌జీపీటీ.. ఇకపై ఆకాశమే హద్దు!

  • చాట్‌జీపీటీకి కీలక మార్పులు చేసిన ఓపెన్ ఏఐ సంస్థ
  • ఇకపై యూజర్ల ప్రశ్నలకు రియల్‌ టైంలో సమాధానాలు ఇవ్వనున్న చాట్‌బాట్
  • మాటలు, చిత్రాలు కూడా చాట్‌జీపీటీ ముందుంచేలా యూజర్ ఇంటర్‌ఫేస్‌లో మార్పులు
జనరేటివ్ ఏఐ టెక్నాలజీ సామర్థ్యం ఎంతటిదో తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేసింది చాట్‌జీపీటీ! అయితే, చాట్‌బాట్ ఇప్పుడు మరింతగా ముదిరిపోయింది. ఇకపై మనం అడిగే ప్రశ్నలకు నెట్టింట్లో దొరికే అతి తాజా సమాచారం ఆధారంగా జవాబులు ఇవ్వనుంది. అంటే.. యూజర్ల ప్రశ్నలకు రియల్ టైంలో సమాధానమిచ్చేలా చాట్‌జీపీటీకి ఓపెన్ ఏఐ సంస్థ కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం ఈ కొత్త ఫీచర్‌ను చాట్‌జీపీటీ ప్లస్, కమర్షియల్ సబ్‌స్క్రైబర్లకు అందుబాటులోకి తెచ్చామని, త్వరలో నాన్ సబ్‌స్క్రైబర్లూ ఈ ఫీచర్ వాడుకునే అవకాశం కల్పిస్తామని ఓపెన్ ఏఐ పేర్కొంది.చాట్‌జీపీటీతో యూజర్లు నేరుగా మాట్లాడే విధంగా కూడా మార్పులు చేస్తున్నట్టు ఓఫెన్ ఏఐ పేర్కొంది. అంతేకాకుండా, దీనికి ఫొటోలు చూపించి కావాల్సిన సమాధానాల్ని రాబట్టుకునేలా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొంది. 

ఇప్పటివరకూ చాట్‌‌జీపీటీని ఏది అడగాలన్నా కీబోర్డులో టైప్ చేసి అడగాల్సి వచ్చేదన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా, 2021 సెప్టెంబర్ నాటివరకూ ఉన్న సమాచారం ఆధారంగానే చాట్‌జీపీటీ యూజర్ల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేది. కానీ, ఈ పరిమితులు తొలగించి చాట్‌జీపీటీ వినియోగాన్ని మరింతమందికి దగ్గర చేసేందుకు ఓపెన్ ఏఐ ప్రయత్నాలు చేస్తోంది.


More Telugu News