వామ్మో యూపీ పోలీసులు! బైక్‌లో రహస్యంగా తుపాకి పెట్టి.. ఆపై అక్రమ ఆయుధం దొరికిందని అరెస్ట్!
- ఇంటి బయటి సీసీటీవీకి దొరికిపోయిన పోలీసులు
- వీడియో రిలీజ్ చేసిన బాధిత కుటుంబం
- ఇద్దరు కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న ఉన్నతాధికారులు
- చర్యలు తప్పవని హెచ్చరిక
సాధారణంగా ఇలాంటి సీన్లు సినిమాల్లోనే కనిపిస్తుంటాయి. ఇప్పుడు దీనినే ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ పోలీసులు అమలు చేశారు. ఓ వ్యక్తిని అరెస్ట్ చేయాలనుకున్నారు. కానీ, కారణం లేదు కాబట్టి దాన్ని సృష్టించారు. ఆ వ్యక్తి బైక్‌లో రహస్యంగా తుపాకి పెట్టేసి ఆ తర్వాత తనిఖీలో అది దొరికిందని అతడిని అరెస్ట్ చేశారు. పోలీసులు అతడి బైక్‌లో తుపాకి పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ భూ వివాదంలో చిక్కుకున్న అశోక్ త్యాగి-రాఖి దంపతుల కుమారుడు అంకిత్‌ను ఈ నెల 26న పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఇది అక్రమమని, తన కుమారుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ సీసీటీవీలో రికార్డైన ఓ వీడియో ఫుటేజీని షేర్ చేశారు. కొందరు పోలీసులు త్యాగి ఇంటికి రావడం, వారిలో కొందరు పోలీసులు ఇంటి బయట పార్క్ చేసిన త్యాగి కుమారుడు అంకిత్ మోటార్ బైక్‌లో ఓ తుపాకి పెట్టడం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ తర్వాత తనిఖీ చేస్తున్నట్టు నటిస్తూ ఆ తుపాకిని స్వాధీనం చేసుకుని అంకిత్‌ను అరెస్ట్ చేశారు.
భూ వివాదంతో సంబంధం ఉన్న తమ ప్రత్యర్థులతో చేతులు కలిపి పోలీసులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని రాఖీ ఆరోపించారు. ఇప్పుడీ సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ వీడియో వైరల్ కావడంతో స్పందించిన మీరట్ ఎస్పీ దెహాత్ కమలేశ్ బహదూర్.. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, దీని వెనక ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నట్టు గుర్తించామని, వారిని ప్రశ్నిస్తున్నట్టు తెలిపారు. నిందితులను చట్టప్రకారం శిక్షిస్తామని పేర్కొన్నారు.