అదరగొట్టిన టైగర్-3 ప్రోమో..బంపర్ హిట్ పక్కా!
- యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో సల్మాన్ ఖాన్ హీరోగా టైగర్-3
- హీరోయిన్‌గా కత్రినా కైఫ్, విలన్‌గా ఎమ్నార్ హష్మీ,
- ఇటీవలే ప్రోమో విడుదల, సినీ అభిమానుల్లో విశేష స్పందన
- రిచ్ విజువల్స్, సల్మాన్ పంచ్ డైలాగ్స్‌తో విశేషంగా ఆకట్టుకుంటున్న వైనం
ఫ్యాన్స్‌తో పాటు సినీ అభిమానులను అలరించేందుకు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మరోసారి రెడీ అయిపోయారు. ఆయన తాజాగా నటించిన చిత్రం టైగర్-3 త్వరలో విడుదల కానుంది. ఇటీవలే రిలీజ్ అయిన ప్రోమో ప్రస్తుతం ఓ సెన్సేషన్‌గా మారింది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో రూపొందిన ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్.. భారత సీక్రెట్ ఏజెంట్ అవినాశ్ సింగ్ రాథోర్ ప్రాత పోషించారు.
‘‘నా పేరు అవినాశ్ సింగ్ రాథోర్.. కానీ మీ అందరకీ మాత్రం టైగర్’’ అంటూ ట్రైలర్‌లోని సల్మాన్ తొలి డైలాగ్ సినీ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ‘‘ఇప్పటివరకూ దేశం కోసం నిస్వార్థంగా సేవ చేశా. కానీ ఇప్పుడు ప్రతిఫలం కోరుతున్నా’’ అంటూ సాగే డైలాగ్ మూవీపై అంచనాలను మరింత పెంచింది. దేశాన్ని మోసం చేశాడనే అపవాదు ఎదుర్కొంటున్న టైగర్, తన నిర్దోషిత్వాన్ని ఎలా రుజువు చేసుకున్నాడనేదే ఈ మూవీ కథ.
బ్యాండ్ బాజా బారాత్ మూవీ దర్శకుడు మనీశ్ శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సల్మాన్ సరసన కత్రినా కైఫ్ హీరోయిన్. ప్రతినాయకుడిగా ఎమ్రాన్ హష్మీ నటించారు. ఇక ఈ సినిమాలో షారూఖ్ ఖాన్ కూడా అతథి పాత్రలో తళుక్కుమననున్నారు. ఈ ఫ్రాంచైజీలోని ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’ సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడంతో టైగర్-3పై కూడా అంచనాలు పెరిగిపోయాయి. ప్రోమోలోని భారీ విజువల్స్, రిచ్ మేకింగ్ స్టైల్, ‘టైగర్ మరణించనంత వరకూ ఓడిపోనట్టే’ అన్న డైలాగ్‌తో ముగిసే ఈ ప్రోమో అభిమానుల్లో ఎక్సైట్‌మెంట్ భారీగా పెంచేసిందని చెప్పకతప్పదు. ఈ మూవీ బంపర్ హిట్ అని అభిమానులు సోషల్ మీడియా వేదికగా చెబుతున్నారు.