హైదరాబాద్‌లో నాలాలో మొసలి పిల్ల కలకలం
- ఎగువ ప్రాంతం నుంచి వరద నీటిలో కొట్టుకు వచ్చి ఉంటుందంటున్న స్థానికులు
- బల్కాపూర్ నాలా ఉద్ధృతికి కొట్టుకు వచ్చి ఉంటుందంటున్న స్థానికులు
- మొసలి పిల్లను పట్టుకోవడానికి అధికారుల ప్రయత్నాలు
భాగ్యనగరంలో మొసలి పిల్ల కలకలం రేపింది. నగరంలోని చింతల్‌బస్తీ నూతన కొత్త వంతెన నిర్మాణం చేపట్టినచోట నాలాలో ఓ మొసలి పిల్లను స్థానికులు గుర్తించారు. భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతం నుంచి వరద రావడంతో ఇది కొట్టుకు వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. బల్కాపూర్ నాలా ఉద్ధృతికి ఇది కొట్టుకు వచ్చి ఉంటుందని చెబుతున్నారు.
మొసలిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మొసలిని చూసేందుకు పెద్ద ఎత్తున జనాలు తరలి వచ్చారు. దానిని పట్టుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఏనిమల్ ప్రొటక్షన్ టీమ్ కూడా అక్కడకు చేరుకుంది. అది బయటకు వచ్చి నాలా సమీపంలోని ఇళ్లలోకి చేరుకోవచ్చునని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎట్టకేలకు దొరికిన మొసలి
మొసలిని బంధించేందుకు రంగంలోకి దిగిన నాలుగు టీమ్‌లు ఎట్టకేలకు దానిని పట్టుకున్నారు. దాదాపు ఐదు గంటల పాటు శ్రమించారు. జూ అధికారులకు ఆ మొసలి పిల్లను అప్పగించారు.