ఒక స్త్రీగా నేను ఎలాంటిదాన్నో ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరంలేదు.. నా భర్త నమ్మితే చాలు: నారా భువనేశ్వరి

  • నేను ఇలాంటిదాన్ని... అలాంటిదాన్ని అని ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఆవేదన
  • తనకు మనస్సాక్షి ఉందని, వేరేవాళ్లు ఏం వాగినా తనకు అనవసరమని వ్యాఖ్య
  • స్త్రీలందరికీ తాను అదే సందేశం ఇవ్వాలనుకుంటున్నానన్న భువనేశ్వరి
తన గురించి కొంతమంది ఇష్టారీతిన మాట్లాడుతున్నారని, తాను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టీడీపీ నేతలు చేపట్టిన నిరసన దీక్షలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసే వారికి గట్టిగా బుద్ధి చెప్పారు.

'నేనూ  ఒక స్త్రీనేనండీ.. నాకు జరిగింది నేను ఎప్పుడూ మరిచిపోను. ఏంటి నా మీద చూపిస్తారు.. నేను ఇంట్లాంటిదాన్ని, అట్లాంటిదాన్ని అని. నేను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నాకు మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. అది మా ఆయన నమ్మితే చాలు. వేరేవాళ్లు ఏం వాగినా.. అది మనకు అనవసరం. ఇక్కడ ఉండే స్త్రీలందరికీ నేను అదే సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. మగాడు ఏదైనా మాట్లాడుతారండీ, అదేం పట్టించుకోవద్దు. అది పనిలేని వాళ్లు అట్లాగే వాగుతారు. వారు మరిచిపోతున్నారు.. ఒక ఆడది తల్లి, భార్య అని. ఈ సృష్టికి మూలకర్త ఆడది అనే విషయం వారు మరిచిపోయారు' అని ఉద్వేగంతో మాట్లాడారు.


More Telugu News