ఉస్తాద్ సెట్స్ పై పవన్ కల్యాణ్ కు విరాళం అందించిన స్టంట్ మ్యాన్ బద్రి
- ఉస్తాద్ భగత్ షూటింగ్ లో పాల్గొంటున్న పవన్ కల్యాణ్
- సెట్స్ పై పవన్ ను కలిసిన టాలీవుడ్ స్టంట్ మేన్ బద్రి
- పవన్ కు రూ.50 వేల చెక్ అందజేసిన వైనం
- గతంలో తాను పవన్ నుంచి సాయం పొందానని వెల్లడి
- పవన్ చేసే సాయం తనతో ఆగిపోకూడదని ఆకాంక్ష
టాలీవుడ్ స్టంట్ మ్యాన్ బద్రి జనసేన పార్టీకి రూ.50 వేలు విరాళం ఇచ్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ పై జనసేనాని పవన్ కల్యాణ్ ను కలిసిన బద్రి విరాళం తాలూకు చెక్ ను ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా పవన్... బద్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు.
బద్రి తనకు సినిమాల్లోకి రాకముందు నుంచి పరిచయం అని, తాను వైజాగ్ లో నటనలో శిక్షణ తీసుకున్నప్పటి నుంచి బద్రి తెలుసని వివరించారు. బద్రి ఇటీవల చిరంజీవి హీరోగా వచ్చిన భోళాశంకర్ చిత్రంలో ఓ డేరింగ్ స్టంట్ చేశారని, కారుతో చేసిన ఆ ప్రమాదకర స్టంట్ కు బద్రికి రూ.50 వేలు ఇచ్చారని పవన్ వెల్లడించారు. ఇప్పుడా డబ్బును బద్రి జనసేన పార్టీకి విరాళంగా అందిస్తున్నారని, ఆయనను తాను అభినందిస్తున్నానని తెలిపారు. టాలీవుడ్ లో బండ్లు, కార్లతో ఎలాంటి డేరింగ్ స్టంట్స్ చేయాలన్నా బద్రికే సాధ్యమని కొనియాడారు.
అనంతరం బద్రి మాట్లాడుతూ, సాటి మనిషికి సాయం చేయాలన్న గుణాన్ని పవన్ లో 28 ఏళ్ల కిందటే చూశానని వెల్లడించారు. నాడు పవన్ అందించిన చేయూతతో ఇవాళ స్టంట్ మ్యాన్ గా గుర్తింపు తెచ్చుకుని, జీవితంలో స్థిరపడ్డానని వివరించారు. ఇవాళ తన చిన్న కుమార్తె అమెరికాలో చదువుకుంటోంది అంటే అందుకు కారణం పవన్ కల్యాణ్ అని తెలిపారు.
అయితే, పవన్ చేసే సాయం తనతోనే ఆగిపోకూడదని, ఇంకెంతోమంది పవన్ వల్ల సాయం పొందాలని, అందుకే ఆయనకు విరాళం అందిస్తున్నానని బద్రి పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ సీఎం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని, తద్వారా ఆయన ఇంకెంతోమందికి సాయపడే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.