నష్టాల్లో ప్రారంభమై లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 173 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 52 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 1.70 శాతం లాభపడ్డ ఎల్ అండ్ టీ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న మిశ్రమ సంకేతాల నేపథ్యంలో ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లకు ఆ తర్వాత కొనుగోళ్ల మద్దతు లభించింది. మధ్యాహ్నం తర్వాత మార్కెట్లు లాభాల్లోకి మళ్లాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 173 పాయింట్లు లాభపడి 66,118కి పెరిగింది. నిఫ్టీ 52 పాయింట్లు పెరిగి 19,716 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎల్ అండ్ టీ (1.70%), ఐటీసీ (1.51%), సన్ ఫార్మా (1.44%), మారుతి (1.42%), రిలయన్స్ (1.18%). 

టాప్ లూజర్స్:
టైటాన్ (-1.24%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.81%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.68%), ఐసీఐసీఐ బ్యాంక్ (-0.57%), టాటా స్టీల్ (-0.54%).


More Telugu News