ఆయన ఏం తప్పు చేశారో కూడా ఇంతవరకు చెప్పలేకపోయారు: నారా భువనేశ్వరి
- అకారణంగా 19 రోజులుగా చంద్రబాబును జైల్లో ఉంచారన్న భువనేశ్వరి
- ఇంత వరకు ఒక్క ఆధారాన్ని కూడా చూపలేకపోయారని విమర్శ
- లోకేశ్ పాదయాత్రను కూడా ఎన్నో సార్లు అడ్డుకున్నారని మండిపాటు
చంద్రబాబు ఏ తప్పూ చేయలేదనే విషయం అందరికీ తెలుసని ఆయన భార్య నారా భువనేశ్వరి అన్నారు. ప్రజలు సొమ్మును దోచుకోవడం, దాచుకోవడం అనేది ఆయనకు అలవాటు లేదని చెప్పారు. ఆయన ఏం తప్పు చేశారని 19 రోజులుగా జైల్లో నిర్బంధించారని మండిపడ్డారు. ఎలాంటి విచారణ లేకుండానే ఎలా నిర్బంధిస్తారని ప్రశ్నించారు. ఈ 19 రోజుల్లో ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయారని, ఏం తప్పు చేశారో చెప్పలేకపోయారని అన్నారు. అనుక్షణం ప్రజల కోసం ఆలోచించే నాయకుడిని అకారణంగా జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసనలు చేస్తున్న వారిని కూడా పోలీసులు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్ పాదయాత్రను కూడా ఎన్నో సార్లు అడ్డుకున్నారని చెప్పారు. స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లలో ట్రైనింగ్ పొందిన వారు లక్షలు సంపాదిస్తున్నారని తెలిపారు. అందరం చేయిచేయి కలిపి చంద్రబాబుకు అండగా నిలుద్దామని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో టీడీపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహారదీక్ష శిబిరాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.