నిజ్జర్ హత్యలో పాక్ ఐఎస్ఐ హస్తం!

  • ఐఎస్ఐకి అనుకూలంగా వ్యవహరించని నిజ్జర్
  • కిరాయి నేరస్థులతో హత్యకు పథకం పన్నిన ఐఎస్ఐ
  • ఆ మరక భారత్ పై పడేలా పాక్ గూఢచర్య సంస్థ కుట్ర
ఖలిస్థాన్ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ వెనుక పాకిస్థాన్ ఐఎస్ఐ పాత్ర ఉన్నట్టు వెలుగు చూసింది. నిజ్జర్ హత్యకు ఐఎస్ఐ పథక రచన చేసినట్టు బయటపడింది. భారత్-కెనడా సంబంధాలను దెబ్బకొట్టడానికి పాకిస్థాన్ కు చెందిన గూఢచర్య సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఈ పన్నాగం వేసినట్టు విశ్వసనీయ వర్గాలు భావిస్తున్నాయి. గడిచిన రెండేళ్లుగా పాకిస్థాన్ లోకి అడుగు పెట్టిన రౌడీ ముఠాలకు పూర్తి సహకారం అందించాలంటూ నిజ్జర్ పై ఐఎస్ఐ ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలిసింది. కానీ, ఐఎస్ఐ కోరినట్టు చేయకుండా, ఖలిస్థాన్ మాజీ నాయకుల వైపే నిజ్జర్ మొగ్గు చూపించినట్టు సమాచారం. దీంతో నిజ్జర్ హత్యకు నేరస్థులను ఐఎస్ఐ రంగంలోకి దింపింది. 

నిజ్జర్ ను అడ్డు తొలగించడం వల్ల ఆ స్థానంలో మరో వ్యక్తిని కూర్చోబెట్టి, తాము చెప్పినట్టు ఆడించొచ్చన్నది ఐఎస్ఐ వ్యూహం. ఇప్పుడు నిజ్జర్ స్థానంలో మరో నేతను తెరపైకి తీసుకొచ్చేందుకు ఐఎస్ఐ ఏజెంట్లు కెనడాలో ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాదులు అందరినీ ఒక్కటి చేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. అయితే, నిజ్జర్ హత్యోదంతంలో భారత్ ప్రభుత్వం ప్రమేయం ఉందన్న దానికి ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయని కెనడా ప్రధాని ట్రూడో స్వయంగా ప్రకటించడం గమనార్హం. ఈ కేసులో నిజమైన దర్యాప్తు జరిగితే కానీ, అసలు నిజం బయటకు రాదు.


More Telugu News