హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన నారా లోకేశ్

  • ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్ పేరును చేర్చిన సీఐడీ
  • లోకేశ్ ను ఏ14గా పేర్కొన్న సీఐడీ
  • లోకేశ్ పిటిషన్ పై రేపు విచారణ జరిగే అవకాశం
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ నేత నారా లోకేశ్ ను సీఐడీ ఏ14గా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టులో లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు రేపు విచారించే అవకాశం ఉంది. కేసు వివరాల్లోకి వెళ్తే... అమరావతి ప్రాంతంలో టీడీపీ నేతల భూముల విలువను పెంచేలా ఇన్నర్ రింగ్ రోడ్డు అసలు డిజైన్ ను అప్పటి సీఎం చంద్రబాబు మార్చారని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. చంద్రబాబు, మాజీ మంత్రి పి.నారాయణ, లింగమనేని రమేశ్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, ఆర్కే హౌసింగ్ లిమిటెడ్ కు చెందిన అంజనీ కుమార్, హెరిటేజ్ ఫుడ్స్, రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తో పాటు పలువురిని ఎఫ్ఐఆర్ లో చేర్చింది.


More Telugu News