ఖైరతాబాద్ మహా గణేశుడి నిమజ్జనం ఇలా..!
- బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు చివరి పూజ
- గురువారం ఉదయం 7 గంటలకు శోభాయాత్ర ప్రారంభం
- మధ్యాహ్నం 2 లోపు నిమజ్జనం పూర్తి చేస్తామన్న కమిటీ
తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న ఖైరతాబాద్ మహా గణేశుడిని సాగనంపేందుకు ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. బుధవారం అర్ధరాత్రి చివరి పూజ నిర్వహించి శోభాయాత్ర చేపట్టనుంది. అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత మహాగణపతిని కదిలించి, గురువారం మధ్యాహ్నం లోపు నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది.
శోభాయాత్ర నుంచి నిమజ్జనం దాకా..
బుధవారం అర్థరాత్రి 12 గంటలకు మహా గణపతికి చివరి పూజ.. ఆ తర్వాత విగ్రహాన్ని భారీ టస్కర్ లోకి ఎక్కించే ఏర్పాట్లు.. అర్ధరాత్రి 2 నుంచి తెల్లవారుజాము 4 గంటల లోగా ఈ ప్రాసెస్ పూర్తి చేయనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. అనంతరం వెల్డింగ్ పనులు పూర్తిచేసి ఉదయం 7 గంటల నుంచి శోభాయాత్ర నిర్వహిస్తామని చెప్పారు. టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ వరకు శోభాయాత్ర సాగుతుందన్నారు. ఆపై క్రేన్ నెంబర్ 4 వద్ద టస్కర్ నుంచి మహాగణపతి తొలగింపు పనులు చేపట్టి మధ్యాహ్నం 12 గంటలకు పూజ కార్యక్రమం నిర్వహిస్తామని వివరించారు. తర్వాత హుస్సేన్ సాగర్ లో మహాగణపతి నిమజ్జన కార్యక్రమం ఉంటుందని, మధ్యాహ్నం 2 లోపు నిమజ్జనం పూర్తవుతుందని పేర్కొన్నారు.