రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో నారా లోకేశ్ భేటీ

  • స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంలో చంద్రబాబు అరెస్ట్
  • ఢిల్లీలో మకాం వేసిన నారా లోకేశ్
  • జాతీయ మీడియాకు తమ బాణీ వినిపించిన వైనం
  • ప్రముఖులను కలుస్తూ మద్దతు కూడగడుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంటు కేసులో అరెస్టయి, బెయిల్ కోసం పోరాడుతుండగా... ఆయనకు మద్దతు కూడగట్టేందుకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఢిల్లీ ముమ్మరంగా శ్రమిస్తున్నారు. స్కిల్ వ్యవహారంలో ఇప్పటికే జాతీయ మీడియా ఎదుట తమ బాణీని వినిపించిన లోకేశ్... పార్లమెంటులోనూ చంద్రబాబు వ్యవహారం ప్రస్తావనకు వచ్చేలా టీడీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో ఢిల్లీ పెద్దలను కూడా కలుస్తున్నారు. 

తాజాగా నారా లోకేశ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. జగన్ పాలన అరాచకాలమయం అని, విపక్షాలను అణచివేస్తున్నారని లోకేశ్ రాష్ట్రపతికి వివరించారు. 

ఈ సమావేశంలో లోకేశ్ పాటు టీడీపీ ఎంపీలు కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్, గల్లా జయదేవ్ కూడా పాల్గొన్నారు. కాగా, టీడీపీ బృందం చెప్పిన విషయాలను రాష్ట్రపతి సానుకూలంగా విన్నట్టు తెలుస్తోంది.


More Telugu News