ఈ రాష్ట్రంలో మద్యం చౌక.. ఏ రాష్ట్రంలో చాలా కాస్ట్ లీ?
- గోవాలో అతి తక్కువ పన్ను రేటు
- కర్ణాటకలో అత్యధిక రేటు
- రెండో స్థానంలో తెలంగాణ
- విదేశీ మద్యంపై దిగుమతి సుంకాలు అదనం
అందమైన బీచ్ లకు చిరునామా గోవా. దేశంలో ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించే రాష్ట్రాల్లో గోవా ఒకటి. అయితే గోవా కేవలం బీచ్ అందాలకే కాదు.. చౌక మద్యానికీ చిరునామాగా ఉంటోంది. అక్కడ లిక్కర్ పై పన్ను రేటు తక్కువగా ఉండడమే ఇందుకు కారణం. దేశంలో తక్కువ పన్ను విధిస్తున్న రాష్ట్రం ఇదే.
పెట్రోలియం ఉత్పత్తులు, లిక్కర్.. రాష్ట్రాలకు పన్నుల రూపంలో భారీ ఆదాయాన్ని తెచ్చే పెట్టేవి. అందుకే వీటిని జీఎస్ టీ పరిధిలో చేర్చలేదు. దీంతో రాష్ట్రాలు తమ అవసరాల కోసం ఇష్టానుసారం లిక్కర్ పై ఏటా పన్నుల ఆదాయం పెంచుకుంటూ పోతున్నాయి. అందుకే చాలా రాష్ట్రాల్లో మద్యం ప్రియంగా మారిపోయింది.
గోవాలో రూ.100కు విక్రయించే లిక్కర్ (విస్కీ, రమ్, వోడ్కా, జిన్).. అత్యధికంగా కర్ణాటకలో రూ.513 పలుకుతోంది. దేశంలో మద్యం అత్యంత ప్రియం ఇక్కడే కావడం గమనించొచ్చు. ఇక మద్యం ధరల్లో దేశంలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. గోవాలో రూ.100 పలికే మద్యం, తెలంగాణకు వచ్చే సరికి రూ.246గా మారుతోంది. ఢిల్లీలో అయితే దీని ధర రూ.134గా ఉంటోంది. హర్యానాలో రూ.147, యూపీలోరూ.197, రాజస్థాన్ లో రూ.213, మహారాష్ట్రలో రూ.226 చొప్పున వీటి ధరలు ఉన్నాయి. రాష్ట్రాలు విధించే పన్నులకు తోడు విదేశీ మద్యంపై దిగుమతి సుంకాల భారం కూడా పడుతుంది. దీంతో రాష్ట్రాల మద్య విక్రయ ధరల్లో వ్యత్యాసం ఉంటోంది.
గోవాలో 49 శాతం, ఢిల్లీలో 62 శాతం, హర్యానాలో 47 శాతం, యూపీలో 66 శాతం, రాజస్థాన్ లో 69 శాతం, మహారాష్ట్రలో 71 శాతం, తెలంగాణలో 68 శాతం, కర్ణాటకలో 83 శాతం చొప్పున పన్ను రేట్లు అమల్లో ఉన్నాయి.