బ్రేక్ ఫాస్ట్ మానేస్తే కేన్సర్ రిస్క్ పెరుగుతుందా...?

  • అవుననే అంటున్న చైనీస్ అధ్యయనం
  • వైద్య నిపుణుల సైతం ఇదే హెచ్చరిక
  • ఒక్క కేన్సరే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయంటున్న పరిశోధకులు 
ఉదయం ఏమీ తినకపోవడం అనే అలవాటు మంచి చేయదని నిపుణులు పేర్కొంటున్నారు. చాలా మంది ఉదయం టిఫిన్ తినకపోయినా, ఎక్కువ విరామం ఇవ్వకుండా భోజనం చేస్తుంటారు. కొందరు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏమీ తినకుండా ఉంటారు. ఇలా బ్రేక్ ఫాస్ట్ మానేయడం కేన్సర్ కు కూడా దారితీస్తుందని ఓ అధ్యయనం హెచ్చరిస్తోంది. ముఖ్యంగా ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేసేవారిలో ఈసోఫేజియల్ కేన్సర్, కొలరెక్టల్ కేన్సర్, లివర్ కేన్సర్, గాల్ బ్లాడర్ కేన్సర్, ఎక్స్ ట్రా హెపటిక్ బైల్ డక్ట్ కేన్సర్ వస్తుందంటున్నారు. 

ఉదయం ఆహారం తీసుకోకుండా కడుపును మాడబెట్డడం వల్ల గ్లూకోజ్ మెటబాలిజం బలహీనపడుతుంది. తీవ్ర ఇన్ ఫ్లమ్మేషన్, ఒబెసిటీ, గుండె జబ్బులు, కేన్సర్ రిస్క్ పెరుగుతుందని చైనీస్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఫోర్టిస్ హాస్పిటల్ డైటీషియన్ శ్వేతా గుప్తా సైతం ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు. బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేయడం వల్ల గ్యాస్ట్రో ఇంటెస్టినల్ కేన్సర్ కు దారితీయవచ్చని చెబుతున్నారు. గ్లూకోజ్ జీవక్రియలు మందగించడం, తీవ్ర ఇన్ ఫ్లమ్మేషన్ ను కలిగించడం, జన్యువులు మ్యుటేషన్ చెందడం, ఈసోఫాజియల్, కొలరెక్టరల్, స్టమక్ కేన్సర్లకు దారితీసే అవకాశం ఉంటుందన్నారు.

బ్రేక్ ఫాస్ట్ మానేస్తే..?
  • ఉదయం ఆహారం తీసుకోకపోతే అది అలసట, చిరాకుగా మారుతుంది. దీనికి కారణం శక్తి స్థాయులు తగ్గడమే. తలనొప్పి, మైగ్రేయిన్ కు దారితీస్తుంది. అంతేకాదు ఇదే విధానాన్ని దీర్ఘకాలం పాటు కొనసాగిస్తే అది టైప్-2 మధుమేహానికి కారణమవుతుంది.
  • ఇలా స్కిప్ కొట్టడం వల్ల శరీరం ఎక్కువ కేలరీలను స్టోర్ చేస్తుంది. అత్యవసరాల్లో వాడుకునేందుకు కావాలని చెప్పి అలా చేస్తుంది.
  • ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేయడం వల్ల ఒత్తిడి హర్మోన్ కార్టిసోల్ స్థాయులు రక్తంలో పెరిగిపోతాయి. 
  • ఉదయం అల్పాహారం తినకపోవడం వల్ల మధ్యాహ్నం లంచ్ ఎక్కువగా తీసుకుంటారు. దీంతో అధిక కేలరీలు ఒకేసారి వచ్చి చేరతాయి. 
  • రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బుల రిస్క్ పెరుగుతుంది.
  • శిరోజాలు రాలిపోయే సమస్య కూడా ఎదురుకావచ్చు.
  • మెదడుకు గ్లూకోజ్ సరఫరా తగ్గడంతో ఏకాగ్రత దెబ్బతింటుంది.
  • వ్యాధి నిరోధక శక్తి కణాలు బలహీనపడతాయి. ఫలితంగా తరచూ అనారోగ్యం బారిన పడొచ్చు. 
  • కడుపుబ్బరం, గ్యాస్, అసిడిటీ సమస్యలు కూడా ఎదురుకావచ్చు.


More Telugu News