అంగళ్లు కేసులో ముగిసిన వాదనలు.. చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు

  • అంగళ్లు అల్లర్ల కేసులో ఏ1గా ఉన్న చంద్రబాబు
  • ఏపీ హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన బాబు
  • చంద్రబాబు బెయిల్ పై టీడీపీ శ్రేణుల్లో టెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగళ్లులో చోటు చేసుకున్న అల్లర్ల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ఏ1గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 22వ తేదీన ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు... ఈరోజుకు (26వ తేదీ) విచారణను వాయిదా వేసింది. ఈరోజు హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పై వాదనలు జరిగాయి. కాసేపటి క్రితం హైకోర్టులో ఇరువైపు వాదనలు ముగిశాయి. వాదనలు విన్న హైకోర్టు బెయిల్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది. మరోవైపు ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ వస్తుందా? రాదా? అనే టెన్షన్ టీడీపీ శ్రేణుల్లో నెలకొంది.


More Telugu News