జనం రోడ్డెక్కితే జగన్ జడుసుకుంటున్నాడు: నారా లోకేశ్

  • నిరసనల మాట వింటేనే జగన్ ఉలిక్కిపడుతున్నాడన్న లోకేశ్ 
  • ప్రశ్నించే గళాలను చూసి ప్రభుత్వం భయపడుతోందని వ్యాఖ్య 
  • రాష్ట్రంలో దమనకాండ కొనసాగుతోందంటూ లోకేశ్ ట్వీట్
జనం రోడ్డెక్కితే జగన్ జడుసుకుంటున్నాడని, నిరసనల మాట వింటేనే ఉలిక్కిపడుతున్నాడని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. నిరసనలపై ప్రభుత్వ అణచివేత ధోరణిని ఆయన తీవ్రంగా ఖండించారు. తప్పు చేసింది కాబట్టే ప్రశ్నించే గళాలను చూసి ప్రభుత్వం భయపడుతోందని ఆరోపించారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ అంగన్ వాడీలు రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే పోలీసులతో వారిని నిర్బంధించడం దుర్మార్గమని లోకేశ్ మండిపడ్డారు. ప్రభుత్వ వ్యవస్థలో భాగమైన మహిళల పట్ల అంత కర్కశంగా వ్యవహరించాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు.

చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా పోరాడుతున్న వివిధ వర్గాల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు జగన్ పిరికితనానికి అద్దం పడుతోందని నారా లోకేశ్ విమర్శించారు. రాష్ట్రంలో నిరసనలకు దిగిన మహిళలు, నేతలపై పోలీసుల దమనకాండను ప్రజలంతా గమనిస్తున్నారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు, ప్రభుత్వ వ్యతిరేక గళాలు ఉంటాయనే విషయం తెలుసుకోవాలంటూ జగన్ కు హితవు పలికారు.



More Telugu News