రోడ్డు పక్కన పొదల్లో అచేతనంగా కనిపించిన కూన.. పిల్లి అనుకుని పెంచితే బ్లాక్ పాంథర్ అయింది!

  • రష్యాలో ఓ యువతికి ఎదురైన అనుభవం
  • పెరిగిన తర్వాత నల్ల చిరుత అని గుర్తింపు
  • దానితో అనుబంధం మరింత పెంచుకున్న మహిళ
  • కూన దొరికినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం వివరాలను వీడియో రూపంలో షేర్ చేసిన వైనం
రోడ్డు పక్కన పొదల్లో అచేతనంగా కనిపించిన ఓ కూనను పిల్లిగా భావించి ఇంటికి తెచ్చి సపర్యలు చేసి బతికించి దానిని పెంచుకున్న ఓ యువతి ఇప్పుడు ఆశ్చర్యం నుంచి తేరుకోలేకపోతోంది. తాను పెంచుకుంటున్నది పిల్లి కాదని, బ్లాక్ పాంథర్ (నల్ల చిరుత) అని తెలిసి తొలుత షాకైనా ఆ తర్వాత దానిని మరింత జాగ్రత్తగా పెంచుతూ అనుబంధం పెంచుకుంది. 

రష్యాలో ఓ యువతికి ఈ అనుభవం ఎదురైంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ వీడియోలో పొదల్లో కూన కనిపించడం నుంచి ఇప్పటి వరకు మొత్తం వివరంగా ఉంది. తన పెంపుడు శునకంతో కలిసి బ్లాక్ పాంథర్ చక్కగా ఆడుకుంటున్న ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


More Telugu News