భూదాన్ - గ్రామదాన్ సవరణ బిల్లుతో పాటు పలు బిల్లులకు ఏపీ శాసనసభ ఆమోదం

  • అసైన్డ్ భూములు 20 ఏళ్లు దాటిన తర్వాత అమ్ముకునేలా చట్ట సవరణ
  • షేక్ జఫ్రీన్ కు గ్రూప్ 1 పోస్టు ఇచ్చేందుకు ఆమోదం
  • మూడు చక్రాల వాహనాలకు లైఫ్ ట్యాక్స్ కాకుండా త్రైమాసిక పన్ను తీసుకొచ్చే బిల్లుకు ఆమోదం
ఏపీ అసెంబ్లీలో ఈరోజు పలు బిల్లులకు ఆమోద ముద్ర వేశారు. భూదాన్ - గ్రామదాన్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపారు. సభలో రెవెన్యూ మంత్రి మాట్లాడుతూ... ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న చట్టానికి కొన్ని మార్పులు చేశామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సవరణలు చేశామని చెప్పారు. 

అసైన్డ్ భూములను ట్రాన్స్ ఫర్ చేసే సవరణకు కూడా శాసనభ ఆమోదం తెలిపింది. 20 ఏళ్లు దాటిన తర్వాత అమ్మకాలు చేసుకునేలా చట్ట సవరణ చేశారు. వైఎస్ఆర్ హయాంలో 7 లక్షల ఎకరాల అసైన్డ్ ల్యాండ్ అందజేశారని చెప్పారు. లంక భూములపై సాగుదారులకు సంపూర్ణ హక్కును కల్పిస్తున్నామని తెలిపారు. 

డెఫ్ టెన్నిస్ క్రీడాకారిణి షేక్ జఫ్రీన్ కు డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ లో గ్రూప్ 1 పోస్టు ఇస్తూ చట్ట సవరణ చేశారు. 

ఆటోలు వంటి మూడు చక్రాల రవాణా వాహనాలకు లైఫ్ ట్యాక్స్ కాకుండా త్రైమాసిక పన్ను విధానాన్ని తీసుకొచ్చేలా మెటార్ వెహికల్ ట్యాక్సేషన్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపారు. 

ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ల ద్వారా వస్తువుల సరఫరాకు సంబంధించి కాంపోజిట్ ట్యాక్స్ లో మార్పులు చేసే బిల్లుకు ఆమోదం తెలిపారు. 

అంతర్జాతీయ యూనివర్శిటీలతో ఎంవోయూలు చేసుకునేలా రెండు యూనివర్శిటీలకు గుర్తింపు ఇచ్చేలా ప్రైవేట్ యూనివర్శిటీల చట్టంలో సవరణకు ఆమోదం తెలిపారు. అపోలో యూనివర్శిటీ, మోహన్ బాబు యూనివర్శిటీలకు అవకాశం కల్పించేలా మార్పులు చేశారు.


More Telugu News