అలా జరిగితే మూడు నెలల్లో ఇంటికి జగన్: నారా లోకేశ్
- షెడ్యూల్ ప్రకారం జరిగితే ఆరు నెలల్లో ఇంటికి జగన్ అన్న లోకేశ్
- వైసీపీ అరాచక పాలన అంతం కావడం ఖాయమన్న టీడీపీ యువనేత
- మహా నియంతలే మట్టిలో కలిసిపోయారు.. మీరెంత? అని ప్రశ్న
వచ్చే ఎన్నికల్లో జగన్ దండుపాళ్యం గ్యాంగ్ చాప్టర్ క్లోజ్ అవుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... పోలీసులను అడ్డు పెట్టుకొని ఇంకా ఎన్నాళ్లు అరాచక పాలన కొనసాగిస్తారు? అని నిలదీశారు. ముందస్తు ఎన్నికలు వస్తే మూడు నెలలు, షెడ్యూల్ ప్రకారం జరిగితే ఆరు నెలల్లో జగన్ ఇంటికి పోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. వైసీపీ అరాచక పాలన అంతం కావడం ఖాయమన్నారు.
మహా నియంతలే మట్టిలో కలిసిపోయారని, ఇక మీరెంత? అని ధ్వజమెత్తారు. మీ అధికార మదం ఎలా ఉందంటే ఐటీ ఉద్యోగుల ర్యాలీని కూడా అడ్డుకున్నారన్నారు. రాష్ట్ర సరిహద్దులో యుద్ధ వాతావరణం సృష్టించారన్నారు. అంగన్వాడీ వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరితే మహిళలను కూడా చూడకుండా రాష్ట్రవ్యాప్తంగా నిర్బంధించారన్నారు. ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తే నిర్బంధమా? ప్రజా తిరుగుబాటుని అణచివేయాలని చూస్తే ఉద్యమం అధికమవుతుందన్నారు.