ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగిన మార్కెట్లు
  • 15 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • మార్పు లేకుండా స్థిరంగా నిలిచిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. మార్కెట్లు ఈరోజు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలు మన మార్కెట్లపై పడింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 15 పాయింట్లు లాభపడి 66,034కి చేరుకుంది. నిఫ్టీ ఎలాంటి మార్పు లేకుండా 19,674 వద్ద స్థిరంగా ఉంది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (4.64%), బజాజ్ ఫిన్ సర్వ్ (2.23%), కోటక్ బ్యాంక్ (1.60%), ఏసియన్ పెయింట్స్ (1.44%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.92%). 

టాప్ లూజర్స్:
ఇన్ఫోసిస్ (-1.42%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.17%), విప్రో (-1.10%), టీసీఎస్ (-0.70%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.67%).


More Telugu News