ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ
- కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ తరఫు న్యాయవాది
- అభ్యంతరం వ్యక్తం చేసిన జడ్జి.. సవరణలతో మళ్లీ దాఖలు చేయాలని ఆదేశం
- కస్టడీ రిపోర్టును సీల్డ్ కవర్ లో కోర్టుకు అందించిన సీఐడీ
- మరో ఐదు రోజుల పాటు చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని విజ్ఞప్తి
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతోంది. చంద్రబాబు తరఫు లాయర్లు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ కు సీఐడీ తరఫు న్యాయవాది కౌంటర్ దాఖలు చేశారు. అయితే, ఈ కౌంటర్ పై ఏసీబీ జడ్జి అభ్యంతరం వ్యక్తం చేశారు. మార్పులు చేసి మళ్లీ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. ఇందుకు కొంత టైమ్ ఇచ్చి విచారణను వాయిదా వేశారు. ఆ తర్వాత ఏసీబీ జడ్జి మళ్లీ విచారించనున్నారు. కాగా, రెండు రోజుల కస్టడీకి సంబంధించిన రిపోర్టును అధికారులు సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించారు. చంద్రబాబును మరో ఐదు రోజులు కస్టడీకి అప్పగించాలని పిటిషన్ దాఖలు చేశారు.