'పెదకాపు 1' ద్వారా ఎంట్రీ ఇస్తున్న ఢిల్లీ బ్యూటీ!

  • శ్రీకాంత్ అడ్డాల రూపొందించిన 'పెదకాపు' 
  • రెండు భాగాలుగా రానున్న సినిమా 
  • ఫస్టు పార్టు ఈ నెల 29వ తేదీన విడుదల 
  • ఈ సినిమాతో పరిచయమవుతున్న ప్రగతి శ్రీవాత్సవ
శ్రీకాంత్ అడ్డాలకి గ్రామీణ నేపథ్యంలో కథలపై .. కుటుంబ నేపథ్యంతో కూడుకున్న కథలపై .. అలాగే ప్రేమకథలపై మంచి పట్టు ఉంది. ఆయన గత చిత్రాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. గ్రామీణ నేపథ్యంలోని 'నారప్ప'ను రీమేక్ చేసి హిట్ కొట్టిన ఆయన, విలేజ్ నేపథ్యంలోనే మరో కథను అల్లుకున్నాడు .. ఆ సినిమానే 'పెదకాపు'. రెండు భాగాలుగా ఆయన ఈ సినిమాను డిజైన్ చేసుకున్నాడు. 'పెదకాపు 1'ను ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నాడు. ఈ సినిమాతో హీరోగా విరాట్ కర్ణ పరిచయమవుతున్నాడు. ఇక హీరోయిన్ కూడా కొత్త అమ్మాయినే .. ఆమె పేరు ప్రగతి శ్రీవాత్సవ. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి ఈ ఢిల్లీ బ్యూటీ అందరి దృష్టిని ఆకర్షించింది. 'పెదకాపు' టైటిల్ దగ్గర నుంచే అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. గ్రామీణ నేపథ్యంలో ఒక వైపున స్వచ్ఛమైన ప్రేమ .. మరో వైపున అధికారం కోసం చేసే రాజకీయాల నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమా కోసం భారీ స్థాయిలో నిర్మాతలు ఖర్చు చేయడం హాట్ టాపిక్ గా మారింది. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమాతో, ప్రగతి ఇక్కడ బిజీ అవుతుందేమో చూడాలి. 


More Telugu News