వజ్రాల కోసం నడిరోడ్డులో వెతికిన జనం.. వీడియో ఇదిగో!
- గుజరాత్‌లోని సూరత్‌లో ఘటన
- వజ్రాల సంచిని వ్యాపారి పారేసుకున్నట్టు వదంతులు
- అందులో కోట్ల రూపాయల విలువ చేసే వజ్రాలు ఉన్నాయని వార్తలు
- జనం వెతుకులాటతో రద్దీగా మారిన ప్రాంతం
వజ్రాల వ్యాపారానికి ప్రసిద్ధి చెందిన గుజరాత్‌లోని సూరత్‌లో నడిరోడ్డపై జనం వజ్రాల కోసం వెతుకులాట ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వజ్రాల కొనుగోలు, అమ్మకానికి ప్రసిద్ధి చెందిన వరచ్చా ప్రాంతంలో ఓ వ్యాపారి పొరపాటున వజ్రాల ప్యాకెట్‌ను జారవిడిచినట్టు రూమర్లు వ్యాపించాయి.
నడిరోడ్డుపై పడిపోయిన ఆ సంచిలో కోట్ల రూపాయల విలువైన వజ్రాలు ఉన్నాయని ఓ మెసేజ్ చక్కర్లు కొట్టింది. అంతే.. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన జనం నడిరోడ్డుపై వాహనాలు ఆపి వజ్రాల కోసం వెతుకులాట ప్రారంభించారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారిపోయింది. అక్కడి రోడ్డును ఊడుస్తూ కొందరు, కూర్చుని అణువణువూ గాలిస్తూ మరికొందరు వజ్రాల కోసం వెతుకుతున్న వీడియోలు సోషల్ మీడియాకెక్కాయి. కొందరికి కొన్ని వజ్రాలు కనిపించినా అవి ఇమిటేషన్ జ్యుయెలరీలో వాడే అమెరికన్ డైమండ్స్ అని తేలడంతో ఉసూరుమన్నారు. ఇది ప్రాంక్ అయి ఉంటుందని మరికొందరు చెబుతున్నారు.