విశాఖపట్టణం జూలో హార్ట్ ఎటాక్‌తో చనిపోయిన ఆడసింహం

  • మయోకార్డియల్ ఇన్‌ఫ్రాక్షన్‌తో ‘మహేశ్వరి’ మృతి 
  • 2006లో గుజరాత్‌లో జన్మించిన దీనిని 2019లో వైజాగ్ జూకు తరలింపు
  • సింహాల జీవితకాలం గరిష్ఠంగా 18 ఏళ్లే అయినా.. 19వ ఏట మరణించిన మహేశ్వరి
విశాఖపట్టణంలోని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్‌లో 18 సంవత్సరాల ఆడసింహం హార్ట్ ఎటాక్‌తో మరణించింది. ఆడసింహం మహేశ్వరి శనివారం రాత్రి గుండెపోటుతో మరణించినట్టు జూ అధికారులు తెలిపారు. వయసు మీద పడడంతో మయోకార్డియల్ ఇన్‌ఫ్రాక్షన్ (హార్ట్ ఎటాక్)తో అది మరణించినట్టు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది.

2006లో జన్మించిన మహేశ్వరిని 2019లో గుజరాత్‌లోని సక్కర్‌బాగ్ జూ నుంచి వైజాగ్ జూకు తీసుకొచ్చారు. ఇది లక్షలాదిమంది ఆసియాటిక్ సింహాలపై అవగాహన అందించడంతో పాటు సింహాల పరిరక్షణకు తోడ్పడినట్టు జూ అధికారులు తెలిపారు. సాధారణంగా సింహాలు 16 నుంచి 18 ఏళ్లు మాత్రమే జీవిస్తాయి. మహేశ్వరి మాత్రం 19వ ఏటలోకి అడుగుపెట్టింది.


More Telugu News