కుదిరిన డీల్.. ఎల్లుండి కాంగ్రెస్‌లోకి మైనంపల్లి!
- ఇటీవలే బీఆర్ఎస్‌ను వీడిన మైనంపల్లి
- మైనంపల్లికి మల్కాజిగిరి, కుమారుడు రోహిత్‌కు మెదక్ సీటు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఓకే
- ఖర్గే సమక్షంలో పార్టీలో చేరిక
- ఆయన వెంట నలుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా..
బీఆర్ఎస్ మాజీ నేత మైనంపల్లి హన్మంతరావు ఈ నెల 27న కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్దమైంది. ఢిల్లీలో ఖర్గే సమక్షంలో కుమారుడు రోహిత్‌తోపాటు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్ నేడు మైనంపల్లి నివాసానికి వెళ్లి పార్టీలోకి లాంఛనంగా ఆహ్వానించనున్నారు.
మైనంపల్లికి మల్కాజిగిరి, ఆయన కుమారుడికి మెదక్ సీటును ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయినట్టు ప్రచారం జరుగుతోంది. మైనంపల్లితోపాటు మరో నలుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్టు సమాచారం.