నాలో నుంచి రజనీ స్టైల్ ను వేరుచేయడం కష్టం: 'చంద్రముఖి 2' ఈవెంటులో లారెన్స్
- సందడిగా జరిగిన 'చంద్రముఖి 2' ప్రీ రిలీజ్ ఈవెంట్
- లారెన్స్ తో కలిసి స్టెప్పులు వేసిన కంగనా - మహిమ
- కీరవాణితో కలిసి పనిచేయడం గర్వంగా ఉందన్న లారెన్స్
- ఈ నెల 28వ తేదీన విడుదలవుతున్న సినిమా
కంగనా - లారెన్స్ ప్రధానమైన పాత్రలను పోషించిన 'చంద్రముఖి 2' ఈ నెల 28వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం హైదరాబాదులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంటులో లారెన్స్ మాట్లాడాడు. " నేను చిరంజీవిగారిని చూసి డాన్స్ నేర్చుకున్నాను. రజనీ సార్ ను చూసి స్టైల్ నేర్చుకున్నాను. అందువలన సహజంగానే నా నడకలో రజనీ సార్ స్టైల్ ఉంటుంది. ఈ సినిమాలో నా నుంచి ఆ స్టైల్ ను వేరు చేయడానికి వాసుగారు ట్రై చేసినా కుదరలేదు" అన్నాడు.
"కంగనా రనౌత్ తో కలిసి ఈ సినిమా చేయనున్నానని తెలియగానే చాలా హ్యాపీగా అనిపించింది. సెట్లోకి ఆమె గన్ మెన్స్ తో వచ్చారు. దాంతో నేను కాస్త భయపడిపోయాను. కానీ ఆ తరువాత ఆమెతో సాన్నిహిత్యం పెరిగింది. ఇక మహిమ కూడా చాలా బాగా చేసింది. ఆమె పాటలు బాగా పాడుతుంది. ఆమె వాయిస్ విని నేనే పడిపోయాను" అని చెప్పాడు.
"ఇంత పెద్ద బ్యానర్లో చేయడం .. వాసుగారు .. కీరవాణి గారు వంటి సీనియర్స్ తో కలిసి పనిచేయడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. కీరవాణిగారి సింప్లిసిటీ నాకు నచ్చింది. ఆయన మ్యూజిక్ ను గురించి తప్ప దేని గురించి ఆలోచన చేయరు. అలాంటి కీరవాణి గారితో కలిసి పనిచేసే అవకాశం వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది" అని అన్నాడు. ఈ స్టేజ్ పై ఆయనతో కంగనా - మహిమ కలిసి స్టెప్పులు వేయడం అక్కడివారందరిలో ఉత్సాహాన్ని పెంచింది.