ఖలిస్థాన్ నిజ్జర్ హత్య: కెనడాకు కీలక సమాచారం ఇచ్చింది అమెరికాయేనా?

  • న్యూయార్క్ టైమ్స్ పత్రిక సంచలన కథనం
  • అమెరికా అందించిన సమాచారానికి కెనడా మరింత సమకూర్చుకున్నట్లు కథనం
  • సేకరించిన ఆధారాల విడుదలకు సిద్ధంగా లేని కెనడా!
ఖలిస్థాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి కీలక ఇంటెలిజెన్స్ సమాచారం అమెరికా నుంచే కెనడాకు అందినట్లుగా న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనం వెలువరించింది. అగ్రరాజ్యం అందించిన సమాచారానికి కెనడా మరింత సమకూర్చుకున్నట్లుగా ఈ కథనంలో తెలిపింది. భారత దౌత్యవేత్త కమ్యూనికేషన్‌లలోకి చొరబడి సేకరించిన సమాచారం కెనడాకు ఆధారంగా మారిందని, ఈ క్రమంలోనే దర్యాఫ్తుకు భారత్ సహకరించాలని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి సూచించారని అందులో పేర్కొన్నారు.

కెనడా, అమెరికాలు పరస్పరం ఇంటెలిజెన్స్‌ను పంచుకొంటాయి. ఇందులో భాగంగా ఉద్దేశ్యపూర్వకంగా నిజ్జర్ హత్యకు సంబంధించిన ఇంటెజిలెన్స్ సమాచారాన్ని కూడా అమెరికా జొప్పించి కెనడాకు అందించిందని తెలిపింది. అయితే ఈ అంశంపై వైట్ హౌస్ స్పందించాల్సి ఉంది. మరోవైపు, తాము సేకరించిన సమాచారాన్ని విడుదల చేసేందుకు కెనడా కూడా సిద్ధంగా లేదు.


More Telugu News