రెచ్చిపోయిన సూర్యకుమార్, ఆస్ట్రేలియా ఎదుట భారీ లక్ష్యం ఉంచిన భారత్
- 5 వికెట్లు కోల్పోయి 399 పరుగులు చేసిన టీమిండియా
- సెంచరీలతో అదరగొట్టిన శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్
- రాహుల్, సూర్యకుమార్‌ల అర్ధ సెంచరీలు
ఆస్ట్రేలియాతో ఇండోర్‌లో జరుగుతోన్న రెండో వన్డేలో భారత బ్యాట్స్ మెన్ అదరగొట్టారు. నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 399 పరుగులు చేశారు. తద్వారా ఆస్ట్రేలియా ముందు 400 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచారు. దాదాపు అందరు బ్యాట్స్ మెన్ రాణించారు. శుభ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ సెంచరీలతో చెలరేగిపోయారు. గిల్ 97 బంతుల్లో ఆరు సిక్సులతో 104 పరుగులు చేయగా, శ్రేయస్ 90 బంతుల్లో 3 సిక్సులతో 105 పరుగులు చేశాడు.
కెప్టెన్ కెఎల్ రాహుల్ 38 బంతుల్లో 52 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 37 బంతుల్లో 72 పరుగులతో, ఇషాన్ కిషన్ 18 బంతుల్లో 31 పరుగులు రెచ్చిపోయి ఆడారు. రెండో వికెట్‌కు గిల్, శ్రేయస్ 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సూర్యకుమార్ 44 ఓవర్లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు సిక్సులు కొట్టాడు. ఆసీస్ బౌలర్లలో కామెరూన్ గ్రీన్ 2, ఆడమ్ జంపా, సీన్ అబాట్, హేజిల్‌వుడ్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు.