అక్టోబర్ 5 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగింపు

  • రెండు వారాల క్రితం చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ
  • నేడు వర్చువల్‌గా ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన అధికారులు
  • చంద్రబాబు రిమాండ్‌ను మరో 11 రోజులు పొడిగించిన న్యాయమూర్తి
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రిమాండ్ గడువును ఏసీబీ న్యాయస్థానం ఆదివారం పొడిగించింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ రెండు వారాల క్రితం అరెస్ట్ చేసింది. నేటితో రిమాండ్ ముగియడంతో వర్చువల్‌గా ఏసీబీ న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. దీంతో న్యాయమూర్తి ఆయన రిమాండ్‌ను అక్టోబర్ 5వ తేదీ వరకు అంటే మరో 11 రోజులు పొడిగించారు. స్టడీ కూడా ఈరోజు ముగియడంతో ఈ కేసులో మరిన్ని వివరాల రాబట్టేందుకు మరికొన్ని రోజులు తమ కస్టడీకి అప్పగించాలని సీఐడీ కోరింది. 

ఈ కేసులో చంద్రబాబును సీఐడీ రెండు రోజుల పాటు తమ కస్టడీకి తీసుకొని విచారించింది. కస్టడీ కూడా ఈరోజు ముగియడంతో ఈ కేసులో మరిన్ని వివరాల రాబట్టేందుకు మరికొన్ని రోజులు తమ కస్టడీకి అప్పగించాలని సీఐడీ కోరింది. చంద్రబాబును రెండురోజుల పాటు 12 గంటలకు పైగా విచారించిన సీఐడీ 120 ప్రశ్నలు సంధించింది.


More Telugu News