ఆస్ట్రేలియాతో రెండో వన్డే, సెంచరీలతో అదరగొట్టిన శుభ్‌మన్ గిల్, శ్రెయాస్ అయ్యర్
- 86 బంతుల్లో సెంచరీ చేసిన అయ్యర్
- 105 పరుగుల వద్ద ఔటైన శ్రేయస్ అయ్యర్
- 92 బంతుల్లో సెంచరీ చేసిన శుభ్‌మన్ గిల్
ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో వన్డేలో భారత ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్‌లు సెంచరీలతో అదరగొట్టారు. భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. తొలి వన్డేలో రాణించిన గిల్ రెండో వన్డేలోనూ సెంచరీతో చెలరేగాడు. అదే సమయంలో జట్టులో స్థానం కాపాడుకోవడానికి తప్పక రాణించాల్సిన పరిస్థితుల్లో శ్రేయస్ అయ్యర్ సెంచరీతో అలరించాడు.
శ్రేయస్ అయ్యర్ 86 బంతుల్లో సెంచరీ చేశాడు. కెరీర్‌లో అతనికి ఇది మూడో శతకం. సెంచరీ తర్వాత ఫోర్ కొట్టిన అయ్యర్ ఆ తర్వాత 105 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే గిల్ సెంచరీ చేశాడు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో గిల్‌కు ఇది ఆరో సెంచరీ. 92 బంతుల్లో సెంచరీ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే ఔటయ్యాడు. ఈ వార్త రాసే సమయానికి కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ క్రీజులో ఉన్నారు.