రెండో వన్డేలో ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్... టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు భారత్
- మ్యాచ్ కు దూరంగా ఉన్న ఆసీస్ కెప్టెన్ కమిన్స్
- అతని స్థానంలో యువ పేసర్ స్పెన్సర్ జాన్సన్‌కు అరంగేట్రం అవకాశం
- బుమ్రా స్థానంలో భారత తుది జట్టులోకి వచ్చిన ప్రసిధ్ కృష్ణ
మూడో వన్డేల సిరీస్‌లో భాగంగా ఈ రోజు ఇండోర్‌లో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది. భారత్ ముందుగా బ్యాటింగ్‌కు రానుంది. ఈ మ్యాచ్ కోసం ఆసీస్ జట్టులో అనూహ్య మార్పులు జరిగాయి. ఆ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. అతని స్థానంలో స్టీవ్ స్మిత్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. మిచ్ మార్ష్ కూడా దూరంగా ఉండగా.. పేసర్ స్పెన్సర్ జాన్సన్‌కి అరంగేట్రం అవకాశం లభించింది. మరోవైపు భారత్ ఈ మ్యాచ్ లోనూ మహ్మద్ సిరాజ్‌కి విశ్రాంతి ఇచ్చింది. బుమ్రా స్థానంలో ప్రసిధ్ కృష్ణ తుది జట్టులోకి వచ్చాడు.
తుది జట్లు
భారత్: 1 శుభ్‌మన్ గిల్, 2 రుతురాజ్ గైక్వాడ్, 3 శ్రేయస్ అయ్యర్, 4 కేఎల్ రాహుల్ (కెప్టెన్, కీపర్), 5 ఇషాన్ కిషన్, 6 సూర్యకుమార్ యాదవ్, 7 రవీంద్ర జడేజా, 8 R అశ్విన్, 9 శార్దూల్ ఠాకూర్, 10 మహ్మద్ షమీ, 10 ప్రసిధ్ కృష్ణ
ఆస్ట్రేలియా: 1 డేవిడ్ వార్నర్, 2 మాట్ షార్ట్, 3 స్టీవ్ స్మిత్ (కెప్టెన్), 4 మార్నస్ లబుషేన్, 5 జోష్ ఇంగ్లిస్, 6 అలెక్స్ కారీ (కీపర్), 7 కామెరాన్ గ్రీన్, 8 సీన్ అబాట్, 9 ఆడమ్ జంపా, 10 జోష్ హాజిల్‌వుడ్, 11 స్పెన్సర్ జాన్సన్.