ఆసియా క్రీడలు..బంగ్లాదేశ్‌ను చిత్తుచేసి ఫైనల్‌కు చేరిన భారత మహిళల క్రికెట్ జట్టు
- భారత బౌలర్ల ధాటికి 51 పరుగులతో కుప్పకూలిన బంగ్లా టీం
- టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్
- నాలుగు వికెట్లతో బంగ్లాదేశ్ ఓటమిని ఖరారు చేసిన పూజా వస్త్రాకర్
- ఛేదనలో సునాయసంగా విజయం సాధించిన భారత టీం
ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టుకు బంగారు పతకం ఖాయమైనట్టే. ఆదివారం జరిగిన సెమీఫైనల్స్-1లో భారత జట్టు బంగ్లాదేశ్ టీంను చిత్తు చేసి ఫైనల్‌కు చేరింది. 8 వికెట్ల తేడాతో ప్రత్యర్థి టీంను మట్టి కరిపించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగింది. అయితే, భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేక కేవలం 51 పరుగులకే కుప్పకూలింది. ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టిన పూజా వస్త్రాకర్ బంగ్లాదేశ్ టీంకు చుక్కలు చూపించింది. ఇక సటిటాస్ సాధు, గైక్వాడ్, వైద్యా తలా వికెట్ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో నిగార్ సుల్తానా 12 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు.
అనంతరం, లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 5.2 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. భారతీయ టీంలో జెమీమా రోడ్రిగ్స్ (20 నాటౌట్), షెఫాలీ వర్మ (17) రాణించారు. సోమవారం జరిగే ఫైనల్‌లో శ్రీలంక లేదా పాకిస్థాన్‌తో భారత్ తలపడే అవకాశం ఉంది.