కాంగ్రెస్ ఎంపీపై రూ.10 కోట్ల పరువునష్టం దావా వేసిన బీజేపీ సీఎం భార్య

  • ఎంపీ గౌరవ్ గొగోయ్‌పై దావా వేసిన అసోం సీఎం భార్య రినికి భుయాన్ శర్మ
  • ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులో అక్రమాలు అంటూ గొగోయ్ తప్పుడు ఆరోపణలు చేశారని ఆగ్రహం
  • రినికి ప్రైడ్ ఈస్ట్ ఎంటర్టైన్మెంట్స్‌పై ఎక్స్ వేదికగా అబద్దాలు చెబుతున్నారన్న న్యాయవాది
కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్‌పై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రినికి భుయాన్ శర్మ రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్ట్‌లో అవకతవకలు జరిగాయంటూ తప్పుడు ఆరోపణలు చేశారని ఈ దావా వేశారు. కామ్‌రూప్ మెట్రోపాలిటన్‌లోని సివిల్ జడ్జి కోర్టులో శుక్రవారం కేసు దాఖలు చేశామని, ఇది సెప్టెంబర్ 26న విచారణకు రానుందని ఆమె తరఫు న్యాయవాది దేవజిత్ సైకియా పిటిఐకి తెలిపారు.

సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఎక్స్ ద్వారా పలు ట్వీట్ల ద్వారా గౌరవ్ గొగోయ్ తన క్లయింట్ రినికి భుయాన్ శర్మకు నష్టం కలిగించారని, అందుకే రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేశామని తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ గొగోయ్ తన క్లయింట్ రినికికి చెందిన కంపెనీ ప్రైడ్ ఈస్ట్ ఎంటర్టైన్మెంట్స్ గురించి సోషల్ మీడియా వేదికగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. కాగా, ఓ ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందడం కోసం అవకతవకలకు పాల్పడ్డారని గొగోయ్ ఆరోపించారు. దీనిపై ఆమె పరువు నష్టం దావా వేశారు.


More Telugu News