రజనీ సార్ చేసిన పాత్రను నేను చేసే ఛాన్స్ రావడం అదృష్టం: లారెన్స్
- ఈ నెల 28న రానున్న 'చంద్రముఖి 2'
- ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న టీమ్
- 'చంద్రముఖి'ని రజనీ ఫ్యాన్ గా చూశానన్న లారెన్స్
- ఆ సినిమా సీక్వెల్ లో చేస్తానని అనుకోలేదని వెల్లడి
లైకా వారు 'చంద్రముఖి 2' సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించగా, పి.వాసు దర్శకత్వం వహించారు. టైటిల్ రోల్ ను కంగనా రనౌత్ పోషించగా, లారెన్స్ .. మహిమ నంబియార్ కీలకమైన పాత్రలలో నటించారు. ఈ నెల 28వ తేదీన ఈ సినిమా విడుదల కానుండటంతో, కొంతసేపటి క్రితం ప్రెస్ మీట్ ను నిర్వహించారు.
ఈ స్టేజ్ పై లారెన్స్ మాట్లాడుతూ .. 'చంద్రముఖి' సినిమాను నేను కూడా రజనీ సార్ అభిమానిగానే చూస్తూ ఎంజాయ్ చేశాను. ఆ తరువాత వాసు గారు ఆ సినిమాకి సీక్వెల్ చేయాలనుకుంటున్నట్టుగా ఎనౌన్స్ చేసినప్పుడు, రజనీ సార్ తోనే చేస్తారని అనుకున్నాను. వెంటనే కాల్ చేసి వాసుగారికి కంగ్రాట్స్ చెప్పాను. అప్పడు ఆయన ఈ కథను రజనీ సార్ చేయడం లేదని అన్నారు.
"ఆ సాయంత్రమే వాసు గారు నాకు కథ చెప్పారు. కథ వినగానే నాకు బాగా నచ్చేసింది. రజనీ సార్ చేసిన పాత్రలో నేను చేయడం సంతోషంగా అనిపించింది. ఆయన కంటే బాగా చేయాలనే ఆలోచన చేయలేదు. నా స్థాయిలో బెటర్ గా చేయడానికి ట్రై చేశాను. ఎలా చేశాననేది మీరే చెప్పాలి. సీనియర్ ఆర్టిస్టులతో కలిసి పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది" అని అన్నాడు.