ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీకి అనుమతి లేదు: విజయవాడ సీపీ
- ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీపై బెజవాడ సీపీ స్పందన
- హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా రాజమండ్రి వరకు ర్యాలీ
- ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలిసిందన్న సీపీ
- తమ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ర్యాలీలకు అనుమతి ఇవ్వబోమని స్పష్టీకరణ
ఐటీ ఉద్యోగులు కార్ల ర్యాలీ చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసిందని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా వెల్లడించారు. ఐటీ ఉద్యోగులు రేపు (సెప్టెంబరు 24) కార్ల ర్యాలీ నిర్వహించనున్నట్టు సామాజిక మాధ్యమాల ద్వారా తెలిసిందని వెల్లడించారు. వారు హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా రాజమండ్రికి ర్యాలీగా వెళతారని తెలిసింది అన్నారు.
అయితే, విజయవాడలో ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీకి అనుమతి లేదని స్పష్టం చేశారు. కార్లతో సంఘీభావ యాత్రకు అనుమతి ఇవ్వడం కుదరదని పేర్కొన్నారు. తమ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇలాంటి యాత్రలకు అనుమతులు లేవని వివరించారు. నిబంధనలను అతిక్రమించినవారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని సీపీ హెచ్చరించారు. ర్యాలీ నిర్వహిస్తే పలు సెక్షన్ల కింద కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ ఉద్యోగులు నిరసనలు, సంఘీభావ ప్రదర్శనలు చేపడుతున్న సంగతి తెలిసిందే.