ప్రజావేదిక కూల్చివేత మొదలు... అరాచక పాలన ప్రారంభమైంది: పురందేశ్వరి

  • టీడీపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ తమ పార్టీ అధిష్ఠానానికి వివరిస్తామన్నారని వెల్లడి
  • పొత్తులపై కేంద్ర నాయకత్వానిదే తుది నిర్ణయమన్న పురందేశ్వరి
  • ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అట్రాసిటీ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం
ఏపీలో పొత్తులపై తమ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. విశాఖపట్నంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ... టీడీపీతో పొత్తుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ అధిష్ఠానానికి వివరిస్తానని చెప్పారన్నారు. ఆ తర్వాత పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. పొత్తులపై కేంద్ర నాయకత్వం తమ అభిప్రాయాలనూ తీసుకుంటుందన్నారు. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు కట్టుబడి ఉంటామన్నారు.

అమరావతిలో ప్రజావేదిక కూల్చినప్పటి నుంచి రాష్ట్రంలో అరాచక పాలన మొదలైందన్నారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అట్రాసిటీ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం, కక్షధోరణితో ముందుకు సాగుతోందని, ఇది చాలా బాధాకరమన్నారు. ఓ వైపు మోదీ మహిళా సాధికారత కోసం తపనపడుతుంటే, ఏపీలో మాత్రం మద్యం కోసం తపనపడుతున్నారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌లో చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేసుకున్నామన్నారు.


More Telugu News