'జైలర్' విలన్ కి అంత ముట్టజెప్పారట!

  • ఇటీవలే సంచలన విజయాన్ని అందుకున్న జైలర్ 
  • ఖరీదైన కార్లను కానుకగా ఇచ్చిన నిర్మాత 
  • ఆ జాబితాలో వినాయకన్ లేకపోవడం పట్ల కొందరి కామెంట్లు 
  • తన పారితోషికం గురించి ప్రస్తావించిన వినాయకన్
'జైలర్' సినిమాలో యాక్షన్ .. ఎమోషన్ రెండూ ఉన్నాయి. ఈ రెండింటి మధ్య ప్రేక్షకులు హారర్ సినిమా చూస్తున్నప్పటి కంటే ఎక్కువగా భయపడిపోయారు. అందుకు కారకుడు విలన్ వినాయకన్. పక్కా మాస్ లుక్ తో .. మానవత్వమనేది ఏ కోశానా లేని పాత్రలో ఆయన కథను పరిగెత్తించిన తీరు ప్రేక్షకులను కదలకుండా కూర్చోబెట్టేసింది.

వినాయకన్ ఇంతకుముందు తెలుగు సినిమాలు కూడా చేశాడు. కాకపోతే ఆ పాత్రలు ఈ స్థాయిలో లేకపోవడం వలన అంతగా రిజిస్టర్ కాలేదు. ఈ సినిమాలో ఎక్కడా కూడా ఆయన నటిస్తున్నట్టుగా ఉండదు. అంత గొప్పగా నటించిన వినాయకన్ కి పారితోషికంగా 35 లక్షలు మాత్రమే ముట్టాయనే ఒక టాక్ బయటికి వచ్చింది. ఆయన పెర్ఫార్మెన్స్ కి అది చాలా తక్కువనే ప్రచారం మొదలైంది. 

'జైలర్' భారీ లాభాలను తెచ్చిపెట్టడంతో రజనీ .. నెల్సన్ .. అనిరుధ్ లకు నిర్మాత కళానిధి మారన్ ఖరీదైన కార్లను కానుకగా ఇచ్చాడు. విలన్ వినాయక్ కి 35 లక్షల పారితోషికంతోనే సరిపెట్టారనే టాక్ అప్పుడే వచ్చింది. దాంతో ఆయన స్పందిస్తూ అంతకి మూడు రెట్లు తనకి పారితోషికంగా ముట్టిందని చెప్పాడు. అంటే తనకి పారితోషికంగా కోటికి పైనే ముట్టిందంటూ ఈ ప్రచారానికి వినాయకన్ తెరదింపేశాడు. 



More Telugu News