ఎన్ని పార్టీలు మారుతారు మేడం... అదే మీ మెంటాలిటీయా?: పురందేశ్వరిపై పోసాని ధ్వజం
- క్రిమినల్స్‌ను కాపాడటమే మీ పద్ధతా? అని నిలదీత
- చంద్రబాబు పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచాడన్న పోసాని
- పార్టీలు మారే పురందేశ్వరికి జగన్‌ను విమర్శించే నైతిక హక్కు లేదని వ్యాఖ్య
- పురందేశ్వరికి బీజేపీపై కనీసం దోమంత ప్రేమ లేదని ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై పోసాని కృష్ణమురళి మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ... క్రిమినల్స్‌ను కాపాడటం మీ మెంటాలిటీనా? అని ప్రశ్నించారు. చంద్రబాబు పక్కా అవినీతిపరుడన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అవినీతిని నాడే ఎన్టీఆర్ బయటపెట్టాడన్నారు. పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి అన్నారు.
పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా మార్చుకున్నారని విమర్శించారు. చంద్రబాబు దుర్మార్గాలను నందమూరి కుటుంబమే చెప్పిందన్నారు. అలాంటి చంద్రబాబుకు వత్తాసు పలుకుతారా? అని నిలదీశారు. ఎన్నిసార్లు పార్టీలు మారుతారు మేడం? అని ప్రశ్నించారు. నిత్యం పార్టీలు మారే మీకు జగన్‌ను విమర్శించే నైతిక అర్హత లేదన్నారు. ఎన్టీఆర్ వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీలో మీరు ఎలా చేరారు? అందులో కేంద్రమంత్రి పదవిని ఎందుకు తీసుకున్నారు? అని అడిగారు. రేపు ఎన్నికల్లో సమీకరణాలు మారితే మళ్లీ కాంగ్రెస్‌లో చేరి సోనియా, రాహుల్ గాంధీలకు జై కొడతారా? అని అడిగారు.
పురందేశ్వరికి బీజేపీపై కనీసం దోమంత ప్రేమ కూడా లేదన్నారు. ఆమె ఏపీలో బీజేపీ పగ్గాలు చేపట్టగానే వైసీపీని, జగన్‌ను తిట్టడం ప్రారంభించారన్నారు. ఎన్టీఆర్ మద్య నిషేధాన్ని అమలు చేస్తే చంద్రబాబు అదే మద్యాన్ని ఏరులై పారించారన్నారు. మీ ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని కూడా ఇవ్వలేదని పురందేశ్వరిని ఉద్దేశించి అన్నారు.