అత్యద్భుతమైన ఫీచర్లతో భారత మార్కెట్లోకి వివో టీ2 ప్రొ 5జీ.. ధర, స్పెసిఫికేషన్లు ఇలా..!

  • 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ. 23,999
  • హైఎండ్ మోడల్ 8జీబీ+256 జీబీ వేరియంట్ ధర రూ. 24,999 మాత్రమే
  • ఐసీఐసీఐ, యాక్సెస్ బ్యాంకు కార్డులతో కొనుగోళ్లపై రూ. 2వేల తక్షణ రాయితీ
  • వెనకవైపు 64 ఎంపీ డ్యూయల్ కెమెరా
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్.. మీడియా టెక్ డైమెన్సిటీ 7200 చిప్‌సెట్ 
చైనీస్ మొబైల్ మేకర్ వివో ‘టి’ సిరీస్‌లో మరో అద్భుతమైన ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. వివో టీ2 ప్రొ 5జీ పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లే, మీడియా‌టెక్ డైమెన్సిటీ 7200 చిప్‌సెట్, 8జీబీ ర్యామ్ వంటివి ఉన్నాయి. 64 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ, 66 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో దీనిని తీసుకొచ్చింది. ‘ఐక్యూ జడ్7 ప్రొ 5జీ’కి దీనిని రీబ్యాడ్జ్‌డ్ వెర్షన్‌గా చెప్పుకోచ్చు. గత నెలలో భారత్‌లో విడుదలైన ఈ ఫోన్ ఖరీదు రూ.21,999 మాత్రమే. 

వివో టీ2 ప్రొ 5జీ 8 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజీ మోడల్ ధర భారత్‌లో రూ. 23,999 కాగా, టాప్ ఎండ్ మోడల్ అయిన 8జీబీ ర్యామ్ 256జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ. 24,999 మాత్రమే. మూన్ బ్లాక్, డ్యూనె గోల్డ్ రంగుల్లో అందుబాటులో ఉంది. వివో ఇండియా ఈ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్‌లలో అందుబాటులో ఉంది. ఈ నెల 29 నుంచి రిటైల్ స్టోర్లలోనూ లభిస్తుంది. ఐసీఐసీఐ, యాక్సెస్ బ్యాంక్ కార్డుతో ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ. 2 వేల తక్షణ రాయితీ లభిస్తుంది. ఎక్స్‌చేంజ్‌లో అదనంగా రూ. 1000 బోనస్ ఇస్తారు.  

వివో టీ2 ప్రొ 5జీ స్పెసిఫికేషన్లు 
డ్యూయల్ సిమ్ (నానో), ఫన్‌టచ్ ఓఎస్ 13 ఆధారిత ఆండ్రాయిడ్ 13. 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, మీడియా టెక్ డైమెన్సిటీ 7200 చిప్‌సెట్, 8 జీబీ ర్యామ్, మరో 8జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు, వెనకవైపు 64 ఎంపీ సెన్సార్‌తో డ్యూయల్ కెమెరా, ముందువైపు సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరా, 256 జీబీ స్టోరేజీ,  వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ-కంపాస్, గైరోస్కోప్, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ వంటివి ఉన్న ఇందులో 4,600 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు. 66 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 22 నిమిషాల్లోనే జీరో నుంచి 50 శాతం చార్జింగ్ అవుతుంది. ఒకసారి చార్జ్ చేస్తే 56.85 గంటలపాటు ఏకధాటిగా మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు. బరువు 176 గ్రాములు మాత్రమే.


More Telugu News