ఆస్ట్రేలియాతో మ్యాచ్ ముగిసిన తర్వాత.. రాత్రి వేళ అశ్విన్ ప్రాక్టీస్

  • మొహాలీ మైదానంలో బ్యాట్ తో సాధన చేసిన అశ్విన్
  • ఫీల్డర్ గా సేవలు అందించిన టీమిండియా కోచ్ ద్రవిడ్
  • ఆల్ రౌండర్ గా రాణించేందుకు కృషి
మొహాలీలో పంజాబ్ క్రికెట్ స్టేడియంలో శుక్రవారం ఆస్ట్రేలియా-భారత్ వన్డే మ్యాచ్ ముగిసినప్పటికీ.. రవిచంద్రన్ అశ్విన్ విరామం లేకుండా కఠోర సాధన చేయడం కనిపించింది. ఈ మ్యాచ్ లో అశ్విన్ ఒక వికెట్ తీశాడు. ఈ మ్యాచ్ లో భారత్ చక్కని విజయాన్ని సొంతం చేసుకోవడం తెలిసిందే. మరో వికెట్ పడి ఉంటే అశ్విన్ బ్యాటుతో మైదానంలోకి దిగాల్సి  వచ్చేది. ఇందుకోసం అశ్విన్ సిద్దంగా ఉన్నాడు. అతడు రాకుండానే మ్యాచ్ గెలుపు షురూ కాగా, అయినప్పటికీ అశ్విన్ అలాగే, బ్యాట్, హెల్మెట్ తో మైదానంలోకి వచ్చి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. 

తాను బౌలింగ్ పై కాకుండా, బ్యాటింగ్ పైనే దృష్టి పెట్టాల్సిందని లోగడ అశ్విన్ పేర్కొనడం తెలిసిందే. ఐపీఎల్ లో అశ్విన్ బాల్ తోపాటు, బ్యాటింగ్ తోనూ రాణిస్తుండడం తెలిసిందే. నిన్న రాత్రి మైదానంలో అశ్విన్ బ్యాట్ తో ప్రాక్టీస్ చేయగా, టీమిండియా హెచ్ కోచ్ జడేజా ఫీల్డర్ పాత్రను పోషించారు. ప్రపంచకప్ స్క్వాడ్ లో అశ్విన్ కు చోటు దక్కలేదు. అయినా చివరి నిమిషం వరకు ఏదైనా జరగొచ్చన్న ఆశ అశ్విన్ లో ఉందేమో తెలియదు కానీ, అతడు ప్రాక్టీస్ ద్వారా తన ప్రతిభను సానబెట్టుకోవడం కనిపించింది. పైగా టీమిండియా బాల్ తో పాటు బ్యాటింగ్ లోనూ రాణించే వారికి ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో.. అశ్విన్ ఇలా సాధన చేయడం గమనార్హం.


More Telugu News