ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు విదేశాల్లోనూ ఎస్ఎస్ జీ సెక్యూరిటీ

  • ప్రత్యేక చట్టం తీసుకువస్తున్న ఏపీ ప్రభుత్వం
  • శాసన సభలో బిల్లును ప్రవేశ పెట్టిన అధికార పక్షం
  • విదేశాల్లో చదువుతున్న సీఎం కూతుళ్లకు రక్షణ ఏర్పాట్లు
ముఖ్యమంత్రితో పాటు ఆయన కుటుంబ సభ్యుల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త చట్టం తీసుకువస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును ప్రవేశ పెట్టింది. అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన ఈ బిల్లు ప్రకారం.. ముఖ్యమంత్రి, భార్య/ భర్త, పిల్లలు, తల్లిదండ్రులకు నిరంతరం రక్షణ కల్పిస్తారు. సీఎం సమీప కుటుంబ సభ్యుల నివాసం వద్ద, ప్రయాణాల్లో, ఏదైనా ప్రత్యేక కార్యక్రమాల సందర్భంగా రక్షణ ఏర్పాటు చేస్తారు.

రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్లినపుడు సెక్యూరిటీ కల్పిస్తారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో నివసిస్తున్నట్లయితే అక్కడ కూడా సెక్యూరిటీ కల్పించేందుకు ఈ బిల్లులో ప్రతిపాదనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ యాక్ట్- 2023 బిల్లు చట్టంగా మారి అమలులోకి వస్తే.. విదేశాల్లో చదువుకుంటున్న ముఖ్యమంత్రి జగన్ ఇద్దరు కూతుళ్లకు ఏపీ ప్రభుత్వ ఖర్చుతో సెక్యూరిటీ కల్పిస్తారు.


More Telugu News