చంద్రబాబును విచారించే తొమ్మిది మంది సీఐడీ అధికారులు వీరే!
- విచారణ కోసం జైల్లోని కాన్ఫరెన్స్ హాలును సిద్ధం చేస్తున్న అధికారులు
- ధనుంజయనాయుడు నేతృత్వంలో విచారణ
- ముగ్గురు డిప్యూటీ ఎస్పీలు, నలుగురు ఇన్స్‌పెక్టర్లు, ఒక ఏఎస్ఐ, ఒక కానిస్టేబుల్
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై, రాజమండ్రి కేంద్రకారాగారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును 9 మంది సీఐడీ అధికారులు రేపు, ఎల్లుండి... రెండు రోజుల పాటు ఉదయం గం.9.30 నుంచి సాయంత్రం గం.5 వరకు విచారించనున్నారు. ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైల్లో కాన్ఫరెన్స్ హాలును సిద్ధం చేస్తున్నారు. కేసు విచారణాధికారి సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలో విచారణ జరగనుంది. విచారణ సందర్భంగా చంద్రబాబు తరఫున న్యాయవాదులను అనుమతిస్తారు. అయితే చంద్రబాబు మాత్రమే సమాధానం చెప్పాలి.
చంద్రబాబును విచారించనున్న తొమ్మిది మంది అధికారుల్లో... ఎం ధనుంజయనాయుడు (డీప్యూటీ ఎస్పీ), విజయ భాస్కర్ (డిప్యూటీ ఎస్పీ), లక్ష్మీ నారాయణ (డిప్యూటీ ఎస్పీ), ఇన్స్‌పెక్టర్లు మోహన్ కుమార్, రవి కుమార్, శ్రీనివాసన్, సాంబశివరావు, ఏఎస్ఐ రంగనాయకులు, పీసీ సత్యనారాయణ ఉన్నారు. వీరితో పాటు ప్రొఫెషనల్ వీడియో గ్రాఫర్, ఇద్దరు మీడియేటర్లు ఉంటారు.