చంద్రబాబు సీఐడీ విచారణ: 25 మంది కూర్చునేలా హాలు సిద్ధం చేస్తోన్న జైలు అధికారులు

  • రేపు, ఎల్లుండి చంద్రబాబును ప్రశ్నించనున్న సీఐడీ 
  • జైలు డిప్యూటీ సూపరింటెండెంట్‌కు కాన్ఫరెన్స్ హాలు పర్యవేక్షణ బాధ్యత
  • భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తోన్న ఎస్పీ
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ఏసీబీ న్యాయస్థానం రెండు రోజులు సీఐడీ కస్టడీకి అప్పగించింది. రేపు, ఎల్లుండి ఉదయం గం.9.30 నుంచి సాయంత్రం గం.5 వరకు టీడీపీ అధినేతను సీఐడీ అధికారులు విచారించనున్నారు. ఆయనను జైల్లోనే విచారించేందుకు సీఐడీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆదేశాలు అందుకున్న రాజమండ్రి కేంద్రకారాగారం అధికారులు విచారణ కోసం హాలును సిద్ధం చేస్తున్నారు.

సెంట్రల్ జైల్లో కాన్ఫరెన్స్ హాలును విచారణ కోసం సిద్ధం చేస్తున్నారు. చంద్రబాబు సహా 25 మంది కూర్చునేలా సిద్ధం చేసి సీఐడీకి జైలు అధికారులు అప్పగించనున్నారు. ఈ కాన్ఫరెన్స్ హాలు పర్యవేక్షణ బాధ్యతలను జైలు డిప్యూటీ సూపరింటెండెంట్‌కు అప్పగించారు. సీఐడీ ఇచ్చిన సమాచారంతో ఎస్పీ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇప్పటికే విచారణకు సంబంధించి కోర్టు నుంచి సూపరింటెండెంట్ కార్యాలయానికి సమాచారం అందింది.


More Telugu News