అర్ధసెంచరీలతో శుభారంభం అందించిన టీమిండియా ఓపెనర్లు
- మొహాలీలో తొలి వన్డే
- టాస్ గెలిచి ఆసీస్ కు బ్యాటింగ్ అప్పగించిన భారత్
- 50 ఓవర్లలో 276 పరుగులకు ఆసీస్ ఆలౌట్
- లక్ష్యఛేదనలో దూసుకెళుతున్న భారత్
- 20 ఓవర్లలో 129 పరుగులు జోడించిన గిల్, గైక్వాడ్
ఆస్ట్రేలియా జట్టుతో మొహాలీలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాకు శుభారంభం లభించింది. ఆసీస్ నిర్దేశించిన 277 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియాకు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, శుభ్ మాన్ గిల్ పటిష్ఠమైన పునాది వేశారు. వీరిద్దరూ 20 ఓవర్లలో 129 పరుగులు జోడించి, భారత్ ను గెలుపుబాటలో నిలిపారు. గిల్ 51 బంతుల్లో 64, గైక్వాడ్ 69 బంతుల్లో 63 పరుగులతో ఆడుతున్నారు. ఈ జోడీని విడదీసేందుకు ఆసీస్ బౌలర్లు చెమటోడ్చుతున్నారు. భారత్ విజయానికి ఇంకా 30 ఓవర్లలో 148 పరుగులు కావాలి. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 50 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌట్ అయింది.