ప్రతిపక్ష నేత కుర్చీ పైకెక్కి బాలకృష్ణ ఈలలు వేశారు.. చంద్రబాబు తెలివి పారలేదు: మంత్రి వేణుగోపాల కృష్ణ
- సభలో టీడీపీ సభ్యుల తీరు సిగ్గుచేటని విమర్శ
- సభలో మాట్లాడేందుకు టీడీపీ సభ్యుల వద్ద ఎలాంటి సబ్జెక్ట్ లేదని వ్యాఖ్య
- రచ్చ చేసేందుకే సభకు వచ్చారన్న మంత్రి
అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు కుర్చీ పైకి ఎక్కి టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఈలలు వేశారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. సభలో టీడీపీ సభ్యుల తీరు సిగ్గుచేటు అన్నారు. సభ పట్ల వారికి ఎలాంటి గౌరవం లేదన్నారు. బాలకృష్ణ ఈలలు వేసి సభా సంప్రదాయాలను అగౌరవపరిచారన్నారు. సభలో మాట్లాడేందుకు టీడీపీ సభ్యుల వద్ద ఎలాంటి సబ్జెక్ట్ లేదన్నారు. అందుకే వారు అసెంబ్లీ నుంచి పారిపోయారన్నారు.
రచ్చ చేయడానికే టీడీపీ సభ్యులు అసెంబ్లీకి వచ్చారన్నారు. గొడవ చేసిన ఆరుగురి సభ్యులను సస్పెండ్ చేస్తే మిగతా టీడీపీ సభ్యులు కూడా బయటకు వెళ్లిపోయారని గుర్తు చేశారు. మిగతా వారు కూర్చొని స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తమ వాదనలు వినిపించవచ్చు కదా? సభలో సమస్యలు చెప్పవచ్చు కదా? అని ప్రశ్నించారు. టీడీపీకి ప్రజాసమస్యలు పట్టవన్నారు. చంద్రబాబు నేరం చేసిన గజదొంగ అని, అందుకే హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టివేసిందన్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు తెలివి పారలేదన్నారు. ఈ కేసులో చంద్రబాబు అక్రమాలకు ఎలా పాల్పడ్డారో సీఐడీ కోర్టుకు వివరించిందన్నారు. ఢిల్లీ నుంచి సుప్రీంకోర్టు న్యాయవాదులు వచ్చినా కోర్టులో ఆ వాదనలో పస లేకుండా పోయిందన్నారు. పీఏ శ్రీనివాస్ ద్వారా చంద్రబాబు డబ్బులు దోచుకున్న విషయం సీఐడీ గుర్తించిందన్నారు.