కెనడాలో అనుబంధ సంస్థను మూసివేసిన మహీంద్రా అండ్ మహీంద్రా
- ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రాధాన్యత
- రెస్సన్ ఏరోస్పేస్ కార్పోరేషన్‌లో మహీంద్రాకు 11 శాతం వాటా
- కార్యకలాపాలు ఆపివేస్తున్నట్లు దరఖాస్తు, సెప్టెంబర్ 20న ఆమోదం
- రెస్సన్ మూసివేత వల్ల మహీంద్రాకు రూ.28 కోట్లు రానున్నాయి
భారత్-కెనడా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్‌కు అనుబంధంగా కెనడాలో పని చేస్తోన్న రెస్సన్ ఏరోస్పేస్ కార్పోరేషన్ తాజాగా తమ కార్యకలాపాలను ఆపివేసింది. ఈ మేరకు మహీంద్రా అండ్ మహీంద్రా గురువారం రెగ్యులేటరీ పైలింగ్‌లో తెలిపింది.
రెస్సన్ ఏరోస్పేస్ కార్పోరేషన్‌లో మహీంద్రా కంపెనీకి 11 శాతానికి పైగా వాటాలు ఉన్నాయి. తాము స్వచ్ఛందంగా కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు కెనడా కార్పోరేషన్‌కు రెస్సన్ ఏరోస్పేస్ కార్పోరేషన్ దరఖాస్తు చేసింది. దీనికి సెప్టెంబర్ 20న ఆమోదం లభించడంతో, మూతబడింది.
ఆ సంస్థతో తమ కంపెనీకి అనుబంధం కూడా ముగిసిందని మహీంద్రా తెలిపింది. అయితే మూసివేతకు గల కారణాలు వెల్లడించలేదు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇది చర్చనీయాంశంగా మారింది. రెస్సన్ మూసివేత వల్ల మహీంద్రా సంస్థకు దాదాపు రూ.28 కోట్లు రానున్నాయి.