ఈ వయసులో నాకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చారు: ఏసీబీ జడ్జితో చంద్రబాబు వ్యాఖ్యలు
- స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్... నేడు ఏసీబీ కోర్టులో విచారణ
- వర్చువల్ గా విచారణలో పాల్గొన్న చంద్రబాబు
- తనది 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం అని వెల్లడి
- తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆక్రోశం
- తనపై ఉన్నవి ఆరోపణలేనని, ఇంకా నిర్ధారణ కాలేదని స్పష్టీకరణ
నేడు ఏసీబీ కోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ కేసు విచారణ చేపట్టారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు ఇవాళ్టి విచారణలో వర్చువల్ గా పాల్గొన్నారు.
తనది 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం అని ఈ సందర్భంగా చంద్రబాబు న్యాయమూర్తికి తెలిపారు. తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని, తాను తప్పు చేసి ఉంటే విచారణ జరిపి అరెస్ట్ చేయాల్సిందని పేర్కొన్నారు. తాను చేసిన అభివృద్ధి తెలుగు రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపిస్తోందని, అలాంటి తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని చంద్రబాబు వాపోయారు.
"ఇది నా బాధ, నా ఆవేదన, నా ఆక్రందన... ఈ వయసులో నాకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చారు. నాపై ఉన్నవి కేవలం ఆరోపణలే. అవి నిర్ధారణ కాలేదు. చట్టం ముందు అందరూ సమానమే... నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని. న్యాయం గెలవాలని కోరుకుంటున్నాను" అని చంద్రబాబు ఆక్రోశించారు.