చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేస్తూ జడ్జి పేర్కొన్న అంశాలు ఇవే!

  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్... 14 రోజుల రిమాండ్
  • హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన చంద్రబాబు
  • చంద్రబాబు పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు
  • పోలీసుల విచారణలో జోక్యం చేసుకోలేమని స్పష్టీకరణ
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు హైకోర్టులో తీవ్ర నిరాశ కలిగిన సంగతి తెలిసిందే. స్కిల్ స్కాం కేసుకు సంబంధించి ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి కొన్ని అంశాలను ప్రస్తావించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో 140 మంది సాక్షులను విచారించారని, 4 వేల కాపీలను అందజేశారని వెల్లడించారు. ఈ సమయంలో పోలీసుల విచారణలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు. ఈ దశలో క్వాష్ పిటిషన్ పై నిర్ణయం తీసుకోలేమని తెలిపారు. ఈ సందర్భంగా నీహారిక వర్సెస్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలను న్యాయమూర్తి ఉదహరించారు.


More Telugu News