రెండో స్థానానికి దూసుకుపోయిన వివేక్ రామస్వామి

  • రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థుల్లో ట్రంప్ తర్వాతి స్థానం
  • రామస్వామికి 13 శాతం మంది ఓటర్ల మద్దతు
  • యువ ఓటర్లలో మరింత ఆదరణ
  • రోన్ డిశాంటిస్, నిక్కీ హేలీని దాటేసిన వైనం
భారత సంతతి అమెరికన్, రిపబ్లికన్ పార్టీ నేత వివేక్ రామస్వామి అధ్యక్ష ఎన్నికల రేసులో తన బలాన్ని పెంచుకుంటున్నారు. 13 శాతం ఓటర్ల మద్దతుతో రిపబ్లికన్ పార్టీ తరఫున ఆయన రెండో స్థానానికి చేరుకున్నారు. భారత సంతతికే చెందిన నిక్కి హేలీని వెనక్కి నెట్టేశారు. అయినా ఇప్పటికీ రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల ప్రధాన అభ్యర్థిగా డోనాల్డ్ ట్రంప్ 39 శాతం మంది మద్దతుతో మొదటి స్థానంలోనే కొనసాగుతున్నారు. 

ఇక ఇప్పటి వరకు రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థుల్లో రెండో స్థానంలో ఉన్న ఫ్లోరిడా గవర్నర్ రోన్ డిశాంటిస్ ఏకంగా ఐదో స్థానానికి పడిపోయారు. 10 శాతం ఓట్ల మద్దతుకే పరిమితమయ్యారు. సీఎన్ఎన్-యూనివర్సిటీ ఆఫ్ న్యూ హ్యాంప్ షైర్ నిర్వహించిన పోల్ లో ఈ వివరాలు తెలిశాయి. జూలై సర్వే తర్వాత డీశాంటిస్ 13 పాయింట్లు కిందకు దిగిపోయారు. క్రిస్ క్రిస్టీకి 11 శాతం మద్దతు ఉంది. 

రామస్వామి రిపబ్లికన్ గా నమోదు చేసుకోని, 35 ఏళ్ల లోపున్న ఓటర్లలో మద్దతు పెంచుకుంటున్నారు. 35 ఏళ్లలోపు ఓటర్లలో రామస్వామికి 28 పాయింట్లు , 35 ఏళ్లకు పైన 49 ఏళ్లలోపు వారిలో 11 పాయింట్ల చొప్పున మద్దతు పెరిగింది.


More Telugu News