హైకోర్టులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ.. క్వాష్ పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు
- స్కిల్ కేసులో చంద్రబాబు పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు
- సీఐడీ తరపు వాదనలను సమర్థించిన హైకోర్టు
- కాసేపట్లో చంద్రబాబు కస్టడీపై తీర్పును వెలువరించనున్న ఏసీబీ కోర్టు
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు న్యాయమూర్తి కేవలం ఒకే ఒక వాక్యంతో తీర్పును వెలువరించారు. 'ది పిటిషన్ ఈజ్ డిస్ మిస్డ్' అని చెప్పి, బెంచ్ దిగి జడ్జి వెళ్లిపోయారు. ఈ తీర్పుతో స్కిల్ కేసులో సీఐడీ వినిపించిన వాదనలను హైకోర్టు సమర్థించినట్టయింది. తీర్పు కాపీ అందుబాటులోకి వస్తే... జడ్జి ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుని తీర్పును వెలువరించారనే విషయం అర్థమవుతుంది.
మరోవైపు, ఈ మధ్యాహ్నం 2.30 గంటలకు చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించనుంది. క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో... కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టు తీర్పును వాయిదా వేసిన సంగతి తెలిసిందే.